తిరుమల నడక మార్గంలో చెట్టుకు వేళాడుతున్న వ్యక్తి కళేబరాన్ని పోలీసులు, తితిదే విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. అలిపిరి నడక మార్గంలోని నరసింహస్వామి ఆలయానికి సమీపంలో ముగ్గు బావి అటవీ ప్రాంతంలో వ్యక్తి కళేబరం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు, తితిదే విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఘటనా ప్రాంతంలో లభించిన గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ వ్యక్తి మహారాష్ట్ర పుణెకు చెందిన మహేష్‌గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మహేష్ రెండు నెలల క్రితం ఇంటి నుంచి వచ్చేసినట్లు వారు తెలిపారు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగి చాలాకాలం అవుతుండ వచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
తిరుమల నడక మార్గంలో అస్తి పంజరం కలకలం - తిరుపతిలో చెట్టుకు వేలాడుతున్న కళేబరం
తిరుమల నడక మార్గంలో చెట్టుకు వేళాడుతున్న వ్యక్తి కళేబరాన్ని పోలీసులు, తితిదే విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. ఘటనా స్థలంలో లభించిన గుర్తింపు కార్డు ఆధారంగా అతను పుణెకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
Carcass in tirumala