ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

YV Subbareddy: శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాల టికెట్ల ధరలు పెంచే ఆలోచనే లేదు: వైవీ సుబ్బారెడ్డి

Tirumala Tirupati: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాల టికెట్ల ధరలు పెంచే ఆలోచనే లేదని.. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఏప్రిల్ మొదటి వారంలో ఆర్జిత సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

steps are being taken for Tirumala Arjitha seva to start in april
ఏప్రిల్ మొదటి వారంలో ఆర్జిత సేవలు ప్రారంభానికి చర్యలు: వైవీ. సుబ్బారెడ్డి

By

Published : Mar 4, 2022, 11:53 AM IST

Updated : Mar 4, 2022, 12:42 PM IST

TTD on Tickets: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాల టికెట్ల ధరలు పెంచే ఆలోచనే లేదని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. గత సమావేశంలో ధరలు పెంచే అంశంపై చర్చ మాత్రమే జరిగిందన్నారు. వీలైనంత త్వరగా ఏప్రిల్ మొదటి వారంలో ఆర్జిత సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మరో 2 ప్రాంతాల్లో అన్నప్రసాద పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రెండేళ్ల తర్వాత తిరుమలలో సాధారణ పరిస్థితులు వస్తాయని సుబ్బారెడ్డి అన్నారు. భక్తుల భద్రత కోసం 3 వేల సీసీ కెమెరాలు తిరుమలలో ఏర్పాటు చేశామని వెల్లడించారు.

Last Updated : Mar 4, 2022, 12:42 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details