ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతిలో కీచక సంహార గణపతి విగ్రహం..

వినాయక చవితి సంబరాలు ఊరువాడలల్లో వాతావరణం సందడిగా కనిపిస్తోంది. తిరుపతిలో ఏర్పాటు చేసిన కీచక సంహార గణపతి విగ్రహం తన ప్రత్యేకతను చాటుకుంటుంది.

తిరుపతిలో కీచక సంహార గణపతి విగ్రహం..

By

Published : Sep 5, 2019, 10:58 AM IST

తిరుపతిలో కీచక సంహార గణపతి విగ్రహం..

వినాయక చవితి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.ఊరువాడలా గణపతి విగ్రహాల వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. రాష్ట్ర ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంలో ఈ సారి ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ఓ పక్క పర్యవరణ హిత వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీలు..మరో పక్క సామాజిక సందేశాలకు పెద్ద పీట వేశాయి. తిరుపతిలోని ఎస్టీవీ నగర్​లో ఏర్పాటు చేసిన ఈ కీచక సంహార గణపతి విగ్రహం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. కేసు నమోదై ఏ శిక్షా పడకుండా తిరుగుతున్న నిందితులను..వినాయకుడు శిక్షిస్తున్నట్లుగా ఇక్కడ గణపతిని కొలువు తీర్చారు. సామాజిక దృక్కోణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details