- tirumala
తిరుమల శ్రీవారిని శాసన సభాపతి కోడెల శివప్రసాద్ దర్శించుకున్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉందని కోడెల కొనియాడారు. ప్రజలు మరో అవకాశం ఇస్తే పోలవరం, అమరావతి నిర్మాణం పూర్తవుతుందన్నారు.
కోడెల శివప్రసాద్
తిరుమల శ్రీవారిని శాసన సభాపతి కోడెల శివప్రసాద్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న సభాపతికి తితిదే అధికారుల స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకులు మండపంలో పండితుల వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉందని కోడెల కొనియాడారు. ప్రజలు మరో అవకాశం ఇస్తే పోలవరం, అమరావతి నిర్మాణం పూర్తవుతుందన్నారు.