ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చట్ట ప్రకారం ఆ ఆస్తిని ప్రభుత్వానికి అప్పగించడం విరుద్ధం: సోము వీర్రాజు

తితిదే చట్ట ప్రకారం పద్మావతి నిలయాన్ని ప్రభుత్వానికి అప్పగించడం విరుద్ధమని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ మేరకు తితిదే ఈవో జవహర్‌కు లేఖ రాసిన ఆయన.. నిర్ణయాన్ని విరమించుకోకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

సోము వీర్రాజు
సోము వీర్రాజు

By

Published : Mar 7, 2022, 5:01 PM IST

Updated : Mar 7, 2022, 7:47 PM IST

తిరుచానూరు పద్మావతి నిలయాన్ని ప్రభుత్వానికి అప్పగించటంపై భాజాపా అభ్యంతరం వ్యక్తం చేసింది. తితిదే చట్ట ప్రకారం ఆ ఆస్తిని ప్రభుత్వానికి అప్పగించడం విరుద్ధమని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

రూ.100 కోట్లతో తితిదే నిర్మించిన పద్మావతి నిలయాన్ని కొత్త కలెక్టరేట్‌గా మార్చటం సరైంది కాదన్నారు. ఈ మేరకు తితిదే ఈవో జవహర్‌కు లేఖ రాసిన ఆయన.. నిర్ణయాన్ని విరమించుకోకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

తితిదే ఈవోకు సోము వీర్రాజు లేఖ

"ప్రభుత్వ అవసరాల నిమిత్తం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తితిదేకి సంబంధించిన విలువైన స్థలాలు, భవనాలు ఇప్పటికే అప్పగించారు. ఇప్పుడు పద్మావతి నిలయాన్ని బాలాజీ జిల్లా కలెక్టరేట్‌గా మార్చేందుకు తెరలేపారు. నిబంధనల ప్రకారం తితిదే ఆస్తులను, ఆదాయాన్ని ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలి. అందుకు విరుద్ధంగా ఇక్కడి అధికారులు స్వామివారి సొత్తును ప్రభుత్వ అవసరాలకు వినియోగించేందుకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇప్పటికే తిరుపతిలోని చారిత్రక కట్టడంగా చెప్పుకొనే ఎస్‌వీఎన్‌ హైస్కూల్‌ను ఎస్పీ కార్యాలయంగా మార్చారు. ఇలా ముఖ్యమైన కూడళ్ళలో ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే తితిదే స్థలాలను ప్రభుత్వ అవసరాలకు అప్పగించారు. ఈ ప్రయత్నాలను మానుకోకపోతే ఆందోళనకు వెనకాడబోయేది లేదు." -సోము వీర్రాజు, భాజపా అధ్యక్షుడు

ఇదీ చదవండి

విజయవాడలో పలు సంఘాలతో బ్రదర్ అనిల్ భేటీ.. రాజకీయ వర్గాల్లో చర్చ !

Last Updated : Mar 7, 2022, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details