ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Arrest: తిరుపతి 'రుయా ఘటన'లో ఆరుగురు అరెస్టు - రుయా ఘటనలో ఆరుగురు అరెస్టు

తిరుపతి రుయా ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. అంబులెన్స్ డ్రైవర్లు సంఘంగా ఏర్పడి దౌర్జన్యాలు చేస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధరణ అయింది.

తిరుపతి 'రుయా ఘటన'లో ఆరుగురు అరెస్టు
తిరుపతి 'రుయా ఘటన'లో ఆరుగురు అరెస్టు

By

Published : Apr 26, 2022, 10:29 PM IST

తిరుపతి రుయా ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. బాలుడి మృతదేహం తీసుకెళ్లకుండా అడ్డుకున్న అంబులెన్స్ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్ డ్రైవర్లు సంఘంగా ఏర్పడి దౌర్జన్యాలు చేస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధరణ అయింది.

ఏం జరిగిందంటే..: అన్నమయ్య జిల్లా చిట్వేలికి చెందిన మామిడితోటలో కూలీగా చేసే వ్యక్తి తన కుమారుడు జైశ్వ అనారోగ్యంతో ఉండటంతో ఇటీవల తిరుపతి రుయాకు తీసుకొచ్చారు. ఆ బాలుడు చికిత్స పొందుతుండగానే కిడ్నీ, కాలేయం పూర్తిగా పనిచేయకపోవడంతో నిన్న రాత్రి 11 గంటల సమయంలో మృతిచెందాడు. బాలుడిని తిరుపతి నుంచి 90కి.మీ. దూరంలో ఉన్న చిట్వేలికి తీసుకెళ్లడానికి రుయా అంబులెన్స్‌ డ్రైవర్లను అడగ్గా రూ.10వేలు డిమాండ్ చేశారు.

అంత మొత్తం భరించలేని తండ్రి ఈ విషయాన్ని స్వగ్రామంలో ఉన్న తమ బంధువులకు తెలియజేయడంతో వారు ఉచిత అంబులెన్స్‌ను రుయాకు పంపారు. స్వగ్రామం నుంచి వచ్చిన ఆ అంబులెన్స్‌ డ్రైవర్‌ను రుయా అంబులెన్స్‌ డ్రైవర్లు కొట్టి తిరిగి వెనక్కి పంపేశారు. తమ అంబులెన్స్‌ల్లోనే మృతదేహాన్ని తీసుకెళ్లానని పట్టుబట్టారు. దీంతో బాలుడి తండ్రి చేసేదేమీలేక ద్విచక్రవాహనంలోనే కుమారుడిని స్వగ్రామానికి తీసుకెళ్లారు.

ఈ ఘటనపై తెదేపా, భాజపా సహా వివిధ రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఓ బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఆ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు.

ఇదీ చదవండి: తిరుపతిలో అమానవీయం..మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న అంబులెన్స్​ సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details