తెలంగాణ సత్తుపల్లి తేదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణాను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారికంగా పార్టీ మారకపోయినా టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు సండ్ర తెలిపారు. తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు తాను మద్దతిస్తున్నట్లు తెలిపారు. తన నియోజకవర్గంలో అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీలు గెలుపొందే విధంగా ప్రజలంతా తోడుగా నిలిచారని చెప్పారు. త్వరలో అన్ని వివరాలను తెలియజేస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు.
శ్రీవారిని దర్శించుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర - thirupathi
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సత్తుపల్లి తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కుటుంబం. కేసీఆర్ నాయకత్వంతోనే రాష్ట్రాభివృద్ది జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
శ్రీవారి దర్శనంలో సత్తుపల్లి ఎమ్మెల్యే
TAGGED:
thirupathi