మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తన మనవరాలు పోటీలో ఉన్న వార్డుకు వెళ్లారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఓ ఇంట్లోకి వెళ్ళిన సుగుణమ్మను పోలీసులు బయటకు తీసుకువచ్చారు. దీంతో పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతలను పోలింగ్ బూత్‌లలోకి వదిలి.. తనపై జులుం ప్రదర్శిస్తున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓటు హక్కు లేని వార్డులలో ఇతరులు ఉండకూడదని పోలీసులు సుగుణమ్మను బయటకు పంపారు.
మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో దురుసుగా వ్యవహరించిన పోలీసులు - మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనుమరాలు పోటీ వార్తలు
తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారు. వైకాపా నేతలను పోలింగ్ బూత్‌లోకి వదిలి తమపై జులం ప్రదర్శిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Police misbehave with former MLA Sugunamma