ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

VEHICLES PERMISSION WITH LINK ROAD IN TIRUMALA : తిరుపతి- తిరుమల...లింకురోడ్డు ద్వారా వాహనాలకు అనుమతి - Permission for vehicles in tirumala

Permission for vehicles with link road in Tirumala : తిరుపతి-తిరుమల మధ్య ప్రయాణ ఆలస్యాన్ని తగ్గించేందుకు రేపటి నుంచి లింక్ రోడ్డు ద్వారా అముమతిస్తామని తితిదే అదనపు ఈవో తెలిపారు. కొండచరియలు విరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అప్‌ ఘాట్ రోడ్డులో వాహనాలను అనుమతించి లింకు రోడ్డు ద్వారా డౌన్‌ ఘాట్‌ రోడ్డుకు వెళ్లేలా తిరుమలకు అనుమతిస్తామని అదనపు ఈవో ధర్మారెడ్డి వివరించారు.

తిరుపతి- తిరుమల...లింకురోడ్డు ద్వారా వాహనాలకు అనుమతి
తిరుపతి- తిరుమల...లింకురోడ్డు ద్వారా వాహనాలకు అనుమతి

By

Published : Dec 4, 2021, 1:21 AM IST

Updated : Dec 4, 2021, 3:17 AM IST

Permission for vehicles with link road in Tirumala : తిరుమల రెండో ఘాట్‌ రోడ్‌లో కొండచరియలు విరిగిపడినందున... తిరుపతి- తిరుమల మధ్య వాహనాల్లో ప్రయాణించేందుకు ఎక్కువ సమయం పడుతోందని, ఈ ఆలస్యాన్ని తగ్గించేందుకు శనివారం నుంచి లింక్‌ రోడ్డు ద్వారా వాహనాలను అనుమతిస్తామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని శుక్రవారం సాయంత్రం అదనపు ఈవో పరిశీలించారు. ఘాట్‌ రోడ్డులో బండరాళ్లు పడిన ప్రాంతాన్ని దిల్లీ ఐఐటీ ప్రొఫెసర్లు పరిశీలించి అధ్యయనం చేశారని ధర్మారెెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఒక బండరాయి పడేలా ఉండటంతో దాని పటిష్ఠతను ఐఐటీ నిపుణులు పరిశీలించి ఎలాంటి సమస్య ఉండదని చెప్పారని, ట్రాఫిక్‌ను అనుమతించాలని సూచించారని తెలిపారు. అప్‌ ఘాట్ రోడ్డులో వాహనాలను అనుమతించి లింకు రోడ్డు ద్వారా డౌన్‌ ఘాట్‌ రోడ్డుకు వెళ్లేలా తిరుమలకు అనుమతిస్తామని వివరించారు. ఫలితంగా 75శాతం ఆలస్యాన్ని అధిగమించవచ్చని తెలిపారు.

అఫ్కాన్ సంస్థకు బాధ్యతలు...

కొండ చరియలు విరిగి పడిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు పూర్తి చేసే విషయంపై ఐఐటీ నిపుణులు, ఇంజినీరింగ్‌ అధికారులతో తితిదే ఛైర్మన్‌ శుక్రవారం సమావేశం నిర్వహించారని చెప్పారు. పునరుద్ధరణ పనులు పూర్తి చేసేందుకు ఒక నెల సమయం పడుతుందని నిపుణులు సూచించారని, ఇందుకోసం ఎంతో నైపుణ్యం ఉన్న ఆఫ్కాన్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించామని వెల్లడించారు. ఆఫ్కాన్‌ సంస్థ నిపుణుల బృందం 20 రోజుల్లో డిజైన్‌ సిద్ధం చేయాలని కోరామని, మరో నిపుణుల బృందం ఘాట్‌ రోడ్డులో అన్ని బండరాళ్లను పరిశీలించి సర్వే చేసి మరింత బలంగా మార్చేందుకు యాంకరింగ్‌, ట్రిమ్మింగ్‌ తదితర పనులు చేపట్టాలని సూచించామని తెలిపారు. ఈ మొత్తం పనులు 25 రోజుల్లో పూర్తవుతాయన్నారు. అదనపు ఈవో వెంట సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, దిల్లీ ఐఐటి నిపుణులు కె.ఎస్‌.రావు, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ఆఫ్కాన్ సంస్థ ఇంజినీరింగ్ నిపుణులు ఉన్నారు.

ఇవీచదవండి.

Last Updated : Dec 4, 2021, 3:17 AM IST

ABOUT THE AUTHOR

...view details