ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారిని దర్శించుకున్న మైసూరు​ శ్రీ పరకమణి మఠం పీఠాధిపతి - పరాకాల మహాదేశికన్ స్వామీ

మైసూరు​లోని శ్రీ పరకమణి మఠం పీఠాధిపతి శ్రీమద్ అభినవ వగీషా బ్రహ్మంత్ర స్వతంత్ర పరాకాల మహాదేశికన్ స్వామి... తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయన్ను.. చిన్న, పెద్ద జీయర్‌ స్వామివార్లు ఆహ్వానించారు.

parakala mahadesikan visited tirumala temple
స్వామివార్లతో పరాకాల మహాదేశికన్

By

Published : Dec 21, 2020, 6:09 PM IST

తిరుమల శ్రీవారిని మైసూరు శ్రీ పరకమణి మఠం పీఠాధిపతి శ్రీమద్ అభినవ వగీషా బ్రహ్మంత్ర స్వతంత్ర పరాకాల మహాదేశికన్ స్వామి దర్శించుకున్నారు. సంప్రదాయం ప్రకారం పాత అన్నప్రసాద భవనం వద్ద ఉన్న రావిచెట్టు వద్ద ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.

బేడీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న అనంతరం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతికి.. చిన్న, పెద్ద జీయర్‌ స్వామివార్ల సమక్షంలో స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. స్వామివారి మూలమూర్తిని దర్శించుకున్న అనంతరం.. సబేరాలో శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు.

ABOUT THE AUTHOR

...view details