ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సర్పంచి ఎన్నికలు: అభ్యర్థుల ఎంపికలో పార్టీలు

సర్పంచి ఎన్నికలు రానే వచ్చాయి.. తిరుపతి గ్రామీణ మండలంలో నాలుగో విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు.. అధికార పార్టీలో ఆశావహులు రోజురోజుకు పెరిగిపోతున్నారు.. ద్వితీయ శ్రేణి నాయకులకు సర్దిచెప్పడం మండల నాయకులకు తలనొప్పిగా మారుతోంది.. అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపాలో అభ్యర్థుల జాబితా దాదాపుగా కొలిక్కిరాగా భాజపా, జనసేన వెదుకులాటలో ఉన్నాయి.

panchayat elections
పంచాయతీ ఎన్నికలు

By

Published : Jan 31, 2021, 10:52 AM IST

చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలంలో 34 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 400 వార్డులు ఉన్నాయి. మొత్తం 1,33,015 మంది ఓటర్లు ఉన్నారు. మండలంలోని అధికార పార్టీలో ప్రతి పంచాయతీలో రెండు వర్గాలు ఉన్నాయి. వీరు సర్పంచి పదవి తమకు కావాలని ఒక వర్గం, తమకే ఇవ్వాలనే మరో వర్గం పోటీ పడుతున్నాయి. ముందునుంచి వెన్నంటి ఉన్న వారికి ఎమ్మెల్యే అవకాశం కల్పిస్తున్నారు. మధ్యలో పార్టీలోకి వచ్చిన వారికి సర్ది చెబుతున్నారు. కొన్ని పంచాయతీల్లో ఇరు వర్గాల మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉండడంతో కొందరు పట్టువిడవకపోగా, మరికొందరు చేసేది ఏమీలేక మిన్నకుండి పోతున్నారు. అభ్యర్థులు ఖరారైన పంచాయతీల్లో ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేయడం గమనార్హం. తెదేపా మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులను దాదాపుగా గుర్తించారు. మరో మూడు, నాలుగు పంచాయతీల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రావాల్సి ఉంది. భాజపా, జనసేన పార్టీల మద్దతుతో గ్రామీణ మండలంలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఇంకా కొలిక్కి రాలేదు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించడంతో అధికార పార్టీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో ఎమ్మెల్యే సూచనల మేరకు నాయకులు వీటిపై దృష్టిసారిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

ABOUT THE AUTHOR

...view details