ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమలను తాకిన కరోనా ప్రభావం.. తగ్గిన భక్తుల రద్దీ - తిరుమలలో కరోనా ప్రభావం

నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే తిరుమల దేవస్థానం.. కరోనా ప్రభావంతో వెలవెలాపోతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్​లు నిర్మానుషంగా కనపడుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా.. భక్తులు గుంపుగా కంపార్ట్ మెంట్లలో ఉండకుండా తితిదే దర్శనం కల్పిస్తోంది.

no rush in tirumala because of corona virus
తిరుమలను తాకిన కరోనా ప్రభావం.. తగ్గిన భక్తుల రద్దీ

By

Published : Mar 18, 2020, 10:26 AM IST

కరోనా ప్రభావంతో తిరుమలకు భక్తుల రద్దీ తగ్గింది. నిన్న శ్రీవారిని 49,229 మంది దర్శించుకున్నారు. సాధారణ రోజుల కంటే 15 నుంచి 20 శాతం రద్దీ తగ్గింది. నేటి నుంచి శ్రీవారికి కల్యాణోత్సవం సేవను తితిదే యంత్రాంగం ఏకాంతంగా నిర్వహించనుంది. విశేషపూజ, సహస్ర కలశాభిషేకం, వసంతోత్సవం, సేవలు, నిత్య సేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దుచేశారు. సేవా టిక్కెట్టు పొందిన భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు.

అలానే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తితిదే జాగ్రత్తలు పాటిస్తోంది. నిత్యం రసాయనాలతో శుభ్రపరచటంతో పాటు.. దర్శనాల విషయంలో పలు ఆంక్షలు విధించింది. శ్రీవారి పుష్కరిణి మూసి వేసే విషయమై అధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

తిరుమలను తాకిన కరోనా ప్రభావం.. తగ్గిన భక్తుల రద్దీ

ఇవీ చదవండి.. నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ జైన క్షేత్రం

ABOUT THE AUTHOR

...view details