సినిమా టికెట్ ధర గురించి భాజపా నేత సునీల్ దేవధర్ గొడవ చేయటంపై తిరుపతిలో మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నాలుగు షోలకే అనుమతి ఉందన్న మంత్రి.. వకీల్ సాబ్ సినిమాకు, భాజపా గెలుపునకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. పువ్వు గుర్తుకు ఓటెయ్యమంటూ చెవిలో పువ్వులు పెడతారా అని అన్నారు. వకీల్ సాబ్‌ని చూసి సీఎం జగన్ భయపడుతున్నారంటున్న భాజపా నేతలు.. మరి సోహ్రబుద్దీన్ కేసులో ఉన్న అమిత్ షా ఎవరికి భయపడుతున్నారని మంత్రి నిలదీశారు.
అమిత్ షా ఎవరికి భయపడుతున్నారు: మంత్రి పేర్ని నాని - Minister Perninani media conference in Tirupati
భాజపాపై మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. వకీల్ సాబ్ సినిమాకు, భాజపా గెలుపునకు సంబంధం ఏంటని మంత్రి ప్రశ్నించారు.
మంత్రి పేర్ని నాని