ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ - తిరుపతి

అలిపిరి నుంచి కాలినడక మార్గంలో తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కొంత మంది ఆయనతో సెల్ఫీలు దిగారు.

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్

By

Published : Aug 22, 2019, 10:37 AM IST

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందుకున్నారు. మంత్రితో కొందరు సెల్ఫీలు దిగారు. స్వామి వారి కరుణ కటాక్షంతో ముఖ్యమంత్రి నేతృత్వంలో జలాశయాలన్నీ నిండుతున్నాయనీ, వర్షాలు పడి ఇంకా అందరీకీ ఉపయోగపడాలనీ కోరుకున్నట్టుగా తెలిపారు. నిన్న రాత్రి అలిపిరి నుంచి కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారాయన.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details