ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మైక్రో ఆర్ట్స్ లో రాణిస్తున్న మౌళేశ్... బియ్యంపై జాతీయగీతం

కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు తిరుపతికి చెందిన ఓ యువకుడు. చదువులో రాణిస్తూ తనలో ఉన్న కళకు పదునుపెట్టాడు. సూక్ష్మ కళాకృతులు (మైక్రో ఆర్ట్స్) చేస్తూ అందరి మన్నన పొందుతున్నాడు. బియ్యపు గింజలపై జనగణమన గీతం రూపొందించి ఔరా అనిపించుకున్నాడు ఈ యువకుడు.

మైక్రో ఆర్ట్స్ లో రాణిస్తున్న మౌళేశ్... బియ్యంపై జాతీయగీతం రూపకల్పన
మైక్రో ఆర్ట్స్ లో రాణిస్తున్న మౌళేశ్... బియ్యంపై జాతీయగీతం రూపకల్పన

By

Published : Aug 14, 2020, 6:51 PM IST

తిరుపతికి చెందిన శివప్రసాద్, పద్మలత దంపతుల కుమారుడు మౌళేశ్. తమిళనాడులోని కాంచీపురం శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం పూర్తిచేసిన మౌళేశ్... సూక్ష్మ కళాకృతుల తయారీలో రాణిస్తున్నాడు. ఖాళీ సమయంలో తన ప్రతిభకు మెరుగులు దిద్దుతూ.. ఆకర్షణీయమైన చూడ చక్కని మైక్రో ఆర్ట్స్ చేస్తున్నాడు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బియ్యపు గింజలపై జాతీయ గీతాన్ని తెలుగులో రూపుదిద్దాడు. గత ఏడాది పెన్సిల్​పై జాతీయగీతాన్ని ఆంగ్లంలో రూపుదిద్ది అందరి మన్ననలు పొందాడు మౌళేశ్.

సూక్ష్మ కళాకృతులు తయారుచేస్తున్న మౌళేశ్ వాటిని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పొందుపరుస్తాడు. వాటిని వీక్షించిన స్నేహితులు, ఇతరులు కొనుగోలు చేయడం ద్వారా మౌళేశ్ లబ్ధి పొందుతున్నాడు. ఇందులో తనకు వస్తున్న ఆదాయం కన్నా.. తన ప్రతిభను గుర్తించడం ఎంతో ప్రోత్సాహంగా ఉందంటున్నాడు మౌళేశ్.

ఇదీ చదవండి :అర్చకులకు రక్షణ కల్పించడంలో తితిదే విఫలం: రమణ దీక్షితులు

ABOUT THE AUTHOR

...view details