Lokesh reacts on boy death: తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం దిగువ పుత్తూరుకి చెందిన బసవయ్య (7) పాముకాటుతో మరణించాడు. కుమారుడి మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి బండిపై తండ్రి తీసుకెళ్లిన ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఈ ఘటన రాష్ట్రంలో వైకాపా అమానవీయ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. జెండా ఊపి ఊరేగించిన అంబులెన్సులు ఏమయ్యాయని ధ్వజమెత్తారు. సర్కారు అంబులెన్సులు రాక.. ప్రైవేటు వాహన యజమానులు డిమాండ్ చేసే డబ్బు ఇవ్వలేక.. నిరుపేదలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపాకు ఓటేసిన పాపానికి కుటుంబసభ్యులు గౌరవంగా అంత్యక్రియలు చేయలేని దయనీయస్థితిలో ఉన్నాయని ధ్వజమెత్తారు.
జెండా ఊపి ఊరేగించిన అంబులెన్సులు ఏవి..? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన లోకేశ్ - Lokesh
Lokesh reacts boy death: బాలుడి మృతదేహాన్ని బైక్‌పై తరలించిన ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. రాష్ట్రంలో వైకాపా అమానవీయ పాలనకు ఈ ఘటన నిదర్శనమని పేర్కొన్నారు. జెండా ఊపి ఊరేగించిన అంబులెన్సులు ఏమయ్యాయని ధ్వజమెత్తారు.

అసలేం జరిగిందంటే: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలం దిగువ పుత్తూరు గ్రామంలో బసవయ్య అనే ఏడేళ్ల బాలుడు ఇంట్లో ఉన్న సమయంలో పాము కాటేసింది. బాలుడిని కేవీబీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆరోగ్య కేంద్రానికి వెళ్లేసరికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రైవేటు వాహన యజమానులు నిరాకరించడంతో.. తండ్రి చంచయ్య దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. దీంతో చేసేదేమీలేక కుమారుడి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తన స్వగ్రామానికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలు లేకపోవడం వల్లే.. ఈ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:
మహాకాల్ లోక్ కారిడార్‌ను జాతికి అంకితమిచ్చిన ప్రధాని
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. గ్రూప్‌లో ఇక 1024 మంది!
అలాంటి పోజులైనా ఇచ్చేందుకు సిద్ధమేనంటున్న రష్మిక