తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 10 గంటలు - ttd
వరుస సెలవుల కారణంగా.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
ttd
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండాయి. వైకుంఠం వెలుపల కిలోమీటరు మేర భక్తులు బారులు తీరారు. శ్రీవారి సాధారణ సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 66 వేల 594 మంది భక్తులు దర్శించుకోగా.. నిన్న 29 వేల 565 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం.. 2 కోట్ల 16 లక్షలుగా నమోదైంది.