కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు అవసరమైన వ్యాక్సిన్లను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని తెదేపా మాజీ శాసన సభ్యురాలు సుగుణమ్మ డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలో ఆర్కే డీలక్స్ సమీపంలోని పట్టణ ఆరోగ్య కేంద్రం ఎదుట ప్లకార్డులతో ఆమె నిరసనకు దిగారు.
వాక్సిన్ కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నా.. గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన చెందారు. ఎంత ఎదురుచూసినా.. వ్యాక్సిన్ కోసం కేంద్రాలకు వచ్చేవారికి నిరాశే మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా.. ప్రణాళికాబద్ధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.