ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ADIMULAPU SURESH: కరోనా పట్ల అప్రమత్తత అత్యవసరం.. పర్యవేక్షణకు కంట్రోల్​ సెంటర్లు

By

Published : Aug 25, 2021, 3:28 PM IST

రాష్ట్రంలో పాఠశాలలు(schools) ప్రారంభమైనప్పటికీ విద్యార్థులు(students), తల్లితండ్రులు కరోనా(corona) కట్టడి చర్యలు తప్పని సరిగా పాటించాలని మంత్రి ఆదిమూలపు సురేశ్(minister adimulapu suresh)​ సూచించారు. కరోనా నిబంధనల పరిశీలనకు కంట్రోల్​ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ADIMULAPU SURESH
ADIMULAPU SURESH

పాఠశాలలు(schools) పునః ప్రారంభమైనప్పటికీ కరోనా(corona) పట్ల పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థులు(students) మాత్రం జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందేనని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్(minister adimulapu suresh)​ సూచించారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి.. కొవిడ్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా నిబంధనలు పాటిస్తున్న తీరును పర్యవేక్షించడానికి జిల్లా, రాష్ట్రస్ధాయిల్లో వేరువేరుగా కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సురేశ్​ తెలిపారు. 10 శాతానికి పైబడి కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో పాఠశాలలు(schools) ప్రారంభించలేదన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల(fees) కట్టడికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details