ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అయ్యప్పల వెనకే.. శబరిమలకు శునకం పాదయాత్ర

కాలినడకన శబరిమలకు వెళ్లే భక్తుల బృందాన్ని ఓ శునకం అనుసరిస్తోంది. స్వాములతో కలిసి కిలోమీటర్లకు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. కాళ్ల నొప్పితో బాధ పడుతున్నా.. ప్రయాణం మాత్రం ఆపకుండా కొనసాగిస్తూనే ఉంది. అక్టోబర్ 31న తిరుమల నుంచి శబరిమలకు బయల్దేరిన అయ్యప్ప భక్త బృందంతో.. ఈ శునకం పాదయాత్ర చేస్తోంది.

dog-follows-ayyapa-swamy-yatra

By

Published : Nov 18, 2019, 4:55 PM IST

అయ్యప్పల వెనకే కాలినడకన శునకం ప్రయాణం

రాష్ట్రం నుంచి శబరిమలకు కాలినడకన బయల్దేరిన భక్తుల బృందాన్నిఓ శునకం అనుసరిస్తోంది.చాలా కిలోమీటర్లు ప్రయాణించినా...కాళ్ల నొప్పితో బాధ పడుతున్నా..శునకం తన ప్రయాణాన్ని ఆపడం లేదు.అక్టోబర్31న తిరుమల నుంచి13మంది అయ్యప్ప భక్తుల బృందం..శబరిమల అయ్యప్ప దర్శనానికి బయలుదేరింది. ఈ స్వాముల బృందం ప్రస్తుతం కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లా కొట్టిగేహర చేరుకుంది.స్వాములు మొత్తం480కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంది. మొదటి నుంచిఇప్పటివరకూ శునకం వారిని అనుసరిస్తూనే ఉంది.తాము మొదట గమనించలేదని..చాలా దూరం నుంచి తమతోనే రావడం చూసి ఆశ్చర్యపోయామని స్వాములు తెలిపారు.తమ కోసం తయారు చేసుకున్న ఆహారంలో కొంత శునకానికి అందిస్తున్నట్టు చెప్పారు.ఈ సారి శబరిమల యాత్రలో తమకు ఇది వినూత్న అనుభవమని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details