నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు తిరుమలలో కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేశారు. శ్రీవారి ఆలయం వద్ద గల అఖిలాండంలో ఐదు కిలోల కర్పూరం వెలిగించి, 101 కొబ్బరికాయలు కొట్టారు. బాలకృష్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులతో పాటు తెదేపా నేతలు పాల్గొన్నారు
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో అభిమానుల పూజలు - Nandamuri Balakrishna's birthday news
నటీనటులపై ఉన్న అభిమానాన్ని తెలిపేందుకు, వారి పుట్టిన రోజు వేడుకలను అభిమానులు ఘనంగా జరిపిస్తుంటారు. నేడు నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా తిరుమలలో కొబ్బరికాయలు కొట్టి.. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామి వారిని ప్రార్థించారు.
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో అభిమానుల పూజలు
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకను అతని అభిమానులు తిరుపతిలో సేవా స్ఫూర్తితో నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో వరదరాజుల స్వామి ఆలయం వద్ద పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కారణంగా ఉపాధి లేక, కర్ఫ్యూ సమయంలో కనీస అవసరాలకు ఇబ్బందిపడుతున్న వారి కోసం సాయం చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:Vaccination: ఆధార్ లేకుండానే వృద్ధులకు టీకా.. ప్రభుత్వం నిర్ణయం