ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నకిలీ టిక్కెట్లతో శ్రీవారి భక్తులకు శఠగోపం - తిరుమల నేర వార్తలు

తిరుమలలో నకిలీ టిక్కెట్ల మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నప్పటికీ దళారుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. నకిలీ దర్శన టికెట్ల పేరిట చెన్నైకు చెందిన కొందరు భక్తుల నుంచి 73 వేల రూపాయలను కొట్టేశాడు ఓ వ్యక్తి. మోసం జరిగి రెండు నెలలు గడుస్తున్నా అయినవారు కావటంతో బాధితులు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడారు. ఇప్పుడు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

tirumala
tirumala

By

Published : Feb 10, 2020, 4:37 PM IST

కేసు వివరాలు వెల్లడిస్తున్న సీఐ చంద్రశేఖర్

తిరుమలలో దళారీ చేతిలో చెన్నైకి చెందిన భక్తులు మోసపోయారు. రవినారాయణ అనే భక్తుడు తిరుమల శ్రీవారి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలసి గతేడాది డిసెంబర్ 13న తిరుమలకు వచ్చారు. దర్శనం కోసం వైకుంఠానికి చేరుకున్న సమయంలో టికెట్లను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. అవి నకిలీ టికెట్లుగా గుర్తించటంతో భక్తులను విచారించారు. తమకు ఓ బంధువు ద్వారా పరిచయమైన లక్తిక్ రాహుల్ అనే వ్యక్తి 73 వేల రూపాయలు తీసుకుని 18 అభిషేకం టికెట్లు, 10 సుప్రభాతం టికెట్లను ఇచ్చాడని వారు వివరించారు. తమకు అవి నకిలీ టికెట్లని తెలియదని విజిలెన్స్ అధికారులకు వెల్లడించారు. తెలిసిన వారు కావటంతో నిందితులపై కేసు పెట్టేందుకు బాధితులు వెనుకాడారు. ఎట్టకేలకు ఇప్పుడు ఫిర్యాదు చేయటంతో తితిదే విజిలెన్స్ విచారణ జరిపి కేసును పోలీసులకు అప్పగించారు. నకిలీ టికెట్లు సృష్టించిన దళారీపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details