ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గోవిందరాజస్వామి కిరీటం 'గోవింద'

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాల మూడు కిరీటాలు మాయమయ్యాయి. తిరుపతి అర్బన్ పోలీసులు, తితిదే విజిలెన్స్ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఆరు ప్రత్యక బృందాలను ఏర్పాటు చేశారు.

By

Published : Feb 3, 2019, 6:17 AM IST

గోవిందరాజస్వామి కిరీటం 'గోవింద'

గోవిందరాజస్వామి కిరీటం 'గోవింద'
తిరుమల శ్రీవారిని దర్శించినవారు తిరుపతిలోని గోవిందరాజ స్వామిని దర్శించుకోక మానరు... శ్రీనివాసుని అన్నగారిగా భక్తుల పూజలందుకుంటున్న గోవిందరాజస్వామి ఆలయంలో శనివారం రాత్రి ఒక్కసారిగా కలకలం రేగింది. స్వామివారి ఉత్సవ మూర్తుల బంగారు కిరీటాలు కనిపించకుండా పోయాయి. ఈ కిరీటాలు సుమారు 1350 గ్రాములుంటాయని పోలీసులు గుర్తించారు.
శనివారం ఉదయం సుప్రభాత సేవలో ఉన్న కిరీటాలు సాయంత్రం 6 గంటల తర్వాత మాయమవ్వడం విజలెన్స్ మహిలా కానిస్టేబుల్​ గుర్తించారు. వెంటనే అధికారులు పోలీసులకు తెలిపారు. అర్బన్​ ఎస్పీ అన్బురాజన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తక్షణం ఆలయానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. తితిదే విజిలెన్స్ అధికారులు, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి ఆధ్వర్యంలో దర్యాప్తు మొదులుపెట్టారు.
తిరుపతి అర్బన్ పోలీసులు, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా విచారణ చేపడుతున్నారు. తితిదే సీవీఎస్వో ఆలయ అర్చకులను, సిబ్బందిని ప్రశ్నించారు. ప్రధాన అర్చకులు పార్థసారధి, హరికృష్ణ, శ్రీనివాసులను తీతీదే సీవీఎస్వో, ఎస్పీ అన్బురాజన్ ప్రత్యేకంగా విచారించారు. 12 సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆలయానికి షిఫ్టులవారీగా వచ్చే ఉద్యోగులను పిలిపించి మరీ విచారించారు. సంఘటాన్ని స్థలాన్ని క్లూస్ టీం క్షుణంగా పరిశీలించారు. పోలీసులు, తితిదే విజిలెన్స్ అధికారులు 6 ప్రత్యేక బృందాలను నియమించి విచారణ ముమ్మరం చేశారు.

ABOUT THE AUTHOR

...view details