చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంటకు చేరుకోనున్న ఆయన... తిరుచానారులో పద్మావతి నిలయం వసతి గృహాన్ని ప్రారంభించనున్నారు. అలిపిరి - చెర్లోపల్లి మధ్య రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు సీఎం తిరుమలకు చేరుకుంటారు. వకుళాదేవి వసతి గృహానికి శంకుస్థాపన చేసిన అనంతరం... రాత్రి 7 గంటలకు శ్రీవారికి పట్ట వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 8 గంటలకు పెదశేష వాహనం సేవలో పాల్గొంటారు. రాత్రికి పద్మావతి వసతి గృహంలోనే జగన్ బస చేయనున్నారు. తిరిగి మంగళవారం ఉదయం 9 గంటలకు రేణిగుంట నుంచి విజయవాడకు బయల్దేరనున్నారు.
నేడు చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన - cm jagan tommarow visit in chitoor distict
ముఖ్యమంత్రి జగన్.. నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఆయన.. రాత్రి 7 గంటలకు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తిరిగి మంగళవారం విజయవాడకు చేరుకుంటారు.
cm jagan tommarow visit in chitoor distict