ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Central team tour in Chittoor district : చిత్తూరు జిల్లాకు కేంద్రబృందం.. పంట నష్టంపై ఆరా - flood-loss-in-chittoor-district

భారీ వరదలతో (crop loss with Heavy rains in chittoor district) తీవ్రంగా నష్టపోయిన చిత్తూరు జిల్లాలో కేంద్రబృందం పర్యటించింది. చంద్రగిరి మండలం భీమవరంలో పంట నష్టపోయిన రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

చంద్రగిరి మండలంలో కేంద్రబృందం పర్యటన
చంద్రగిరి మండలంలో కేంద్రబృందం పర్యటన

By

Published : Nov 26, 2021, 10:24 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని భీమవరంలో ఈరోజు (శుక్రవారం) కేంద్ర బృందం(Central team tour) పర్యటించింది. భీమా నది పరివాహక ప్రాంతంలో 3 గంటల పాటు పర్యటించిన అధికారులు.. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురవడంతో అపార నష్టం జరిగిందని రైతులు కేంద్ర బృందానికి తెలిపారు. అనంతరం ఉద్యానవన పంటల్ని పరిశీలించిన కేంద్ర బృందం.. పూర్తి నివేదిక అందించాలని వ్యవసాయ అధికారుల్ని ఆదేశించింది. భీమవరం చుట్టూ ఉన్న చెరువుల భద్రతపై ఆరా తీశారు.

అనంతరం తిరుపతికి పయనమైన కేంద్రబృందాన్ని.. మామిడిమానుగడ్డ ప్రజలు ఆపారు. తమ గ్రామానికి ఉన్న దారి కోతకు గురై పది రోజులు గడిచినప్పటికీ.. ఇంతవరకు ఏ అధికారీ తమ గ్రామంలో పర్యటించలేదని ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుపై జిల్లా పాలనాధికారి సానుకూలంగా స్పందించారు. మామిడిమానుగడ్డ గ్రామంలో పర్యటించి, పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక పంపించాలని ఎమ్మార్వోను ఆదేశించారు.

అదేవిధంగా.. చెరువులు పూర్తి స్థాయిలో నిండాయని, అధికారులు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ హరి నారాయణ్.. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఇదీచదవండి.

ABOUT THE AUTHOR

...view details