Akkineni Amala: జంతువులను ప్రేమించినప్పుడే సాటి మనుషులను అభిమానించి ప్రేమించగలరని బ్లూ క్రాస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు అక్కినేని అమల అన్నారు. తిరుపతి పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పశువైద్య కళాశాల ఆడిటోరియంలో రేబిస్ వ్యాధి నిర్మూలన, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జరిగిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. రేబీస్ వ్యాధి కుక్కలకు రాకుండా ఉండాలంటే వాటికి తగిన సమయంలో వాక్సినేషన్ ద్వారా వ్యాధుల నుంచి దూరం చేయవచ్చని సూచించారు. రేబిస్ మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉందని.. మీడియా ద్వారా ప్రజలకు రేబిస్ వ్యాధి గురించి తెలుస్తుందన్నారు. కుక్కలు, కోతులు, ఎలుకలు కరిస్తే చిన్నపాటి జాగ్రత్తలు పాటించి.. వైద్యులను సంప్రదించాలని తెలిపారు. అంతకు ముందు యాంటీ రేబిస్ ఫ్రీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అమల పాల్గొన్నారు.
రేబిస్ వ్యాధి రాకుండా కుక్కలకు సరైన సమయంలో వ్యాక్సినేషన్ అవసరం
Akkineni Amala: కుక్కల నుంచి రేబిస్ వ్యాధి రాకుండా ఉండాలంటే వాటికి తగిన సమయంలో వాక్సినేషన్ చేయించాలని.... బ్లూ క్రాస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు అక్కినేని అమల అన్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల రేబిస్ వ్యాధిపై ప్రజలకు మరింత అవగాహన పెరుగుతుందని అన్నారు.
అక్కినేని అమల