తిరుపతిలో అమరావతి పరిరక్షణ సభను విజయవంతం చేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. సభ విజయవంతం చేయడంలో తెదేపా శ్రేణులు భాగం కావాలన్నారు. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలన్నది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కొందరు వైకాపా సానుభూతిపరులు అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారన్నారు. అభివృద్ధి చేతగాక ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే యత్నం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
Atchannaidu On Amaravati Sabha: 'అమరావతి పరిరక్షణ సభను విజయవంతం చేయాలి' - tirupathi
అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ పేరిట.. రేపు రాజధాని రైతులు తలపెట్టిన బహిరంగ సభకు ప్రజలు తరలి రావాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. సభ విజయవంతం చేయడంలో తెదేపా శ్రేణులు భాగం కావాలన్నారు.
రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని చెప్పిన మొదటి వ్యక్తి సీఎం జగన్ అని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. రాజధాని మార్పు భూములు దోచుకున్నవారికే కావాలన్నారు. రాష్ట్ర ప్రజలు కోరుకునేది అభివృద్ధి వికేంద్రీకరణ తప్ప.. అధికార వికేంద్రీకరణ కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తే రాష్ట్రాభివృద్ధికి అడుగులు పడతాయన్నారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి వ్యవసాయాన్ని కుదేలు చేశారని విమర్శించారు.
ఇదీ చదవండి: