నాలుగున్నర గంటలు ...61 పాటలు - cultural
విరామం లేకుండా నాలుగున్నర గంటలపాటు 61 పాటలు పాడి జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్స్ లో డా.రాజేశ్వరీ చంద్రజ స్థానం పొందారు.
డా.రాజేశ్వరీ చంద్రజ
శ్రీకాకుళం పట్టణంలోని బాపూజీ కళామందిరంలో చంద్రజ కల్చరల్స్ అండ్ ఛారిటీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన గీతాలాపన ప్రేక్షకులను అలరించింది. ప్రముఖ నేపథ్య గాయని పి.సుశీల పాటలను డా.రాజేశ్వరీ చంద్రజ ఆలపించారు. నిర్విరామంగా నాలుగున్నర గంటలపాటు 61 పాటలు పాడి శ్రోతలను ఆకట్టుకున్నారు. జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్స్‌లో స్థానం పొందారు.