ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Trains cancelled: ప్రయాణికులు లేక.. 8 రైళ్లు తాత్కాలికంగా రద్దు - irctc news

కరోనా లాక్​డౌన్​తో ప్రయాణికుల సంఖ్య తగ్గినందున రైల్వే శాఖ కొన్ని మార్గాల్లో రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇందులో భాగంగా.. 6 రైళ్లు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి, దక్షిణ మధ్య రైల్వే జోన్‌ మీదుగా రాకపోకలు జరిపే మరో 2 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

trains cancelled temporarily by railway department
8 రైళ్లు తాత్కాలికంగా రద్దు

By

Published : May 29, 2021, 7:12 AM IST

ప్రయాణికుల సంఖ్య స్వల్పంగా ఉన్న రైళ్లను రైల్వేశాఖ(irctc cancelled trains) తాత్కాలికంగా రద్దు చేస్తోంది. తాజాగా 8 రైళ్లను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇందులో 6 రైళ్లు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా.. మరో 2 దక్షిణ మధ్య రైల్వే జోన్‌ మీదుగా రాకపోకలు సాగించేవి. రద్దు చేసిన రైళ్లు.. విశాఖపట్నం-కాచిగూడ (నం.08561) జూన్‌ 1-10 వరకు, కాచిగూడ-విశాఖపట్నం (నం.08562) జూన్‌ 2-11, విశాఖపట్నం-కడప (నం..07488) జూన్‌ 1-10, కడప-విశాఖపట్నం (నం.07487) జూన్‌ 2-11, విశాఖపట్నం-లింగంపల్లి (నం.02831) జూన్‌ 1-10, లింగంపల్లి-విశాఖపట్నం (నం.02832) జూన్‌ 2-11, పుణె-భువనేశ్వర్‌ (నం.02881) జూన్‌ 3-10, భువనేశ్వర్‌-పుణె (నం.02882) జూన్‌ 1-8 వరకు రద్దయ్యాయి.

వేసవి ప్రత్యేక రైళ్లు..

త్రివేండ్రం-మాల్దాటౌన్‌ (06185) రైలు జూన్‌ 1న, మాల్దాటౌన్‌-త్రివేండ్రం (06186) రైలు జూన్‌ 4న బయలుదేరుతుందన్నారు. ఈ రైళ్లు రాజమహేంద్రవరం, సామర్లకోట జంక్షన్‌ రైల్వేస్టేషన్లలో ఆగనున్నాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details