రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ ఆంక్షలు - రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరంలో పోలీసులు.. ఈ ఉదయం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక.. రాకపోకలు పునరుద్ధరించారు.
traffic restrictions
నూతన ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని.. విజయవాడ జనసంద్రమైంది. ఈ ప్రభావం.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంపైనా పడింది. జిల్లా పరిధిలోని దివాన్ చెరువు గామన్ వంతెన వద్ద.. భారీ వాహనాలను పోలీసులు నిలిపేశారు. విజయవాడ వైపు వెళ్లకుండా కొన్ని గంటల పాటు ఆపేశారు. విజయవాడ వైపు ట్రాఫిక్ తగ్గిన అనంతరం.. రాకపోకలు పునరుద్ధరించారు.