ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

.

top news @ 7 pm
ప్రధాన వార్తలు @ 7pm

By

Published : Oct 21, 2020, 7:04 PM IST

  • పట్టువస్త్రాలు సమర్పణ
    విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి ముఖ్యమంత్రి జగన్​ పట్టువస్త్రాలు సమర్పించారు. మూలా నక్షత్రం రోజున సర్వసతీదేవీ అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని సీఎం దర్శించుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • మధ్యంతర ఉత్తర్వులు
    ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాల్లో సీట్లు కుదిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 23ను హైకోర్టు సస్పెండ్ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు... తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'వైకాపా చేసిందేమీ లేదు'
    వైఎస్‌ఆర్‌ బీమాను కొత్త పథకంలా హడావిడి చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. పాత పథకాలకు పేరు మార్చడం తప్ప వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • విషాదం
    వారిద్దరూ సోదరులు... కూరగాయలు, పండ్ల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారి కుటుంబంలో జరుగుతున్న ఘర్షణలతో మనస్థాపానికి గురయ్యారు. ఈ క్రమంలో చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'ఉల్లంఘనను సహించం'
    భారత్​లో మానవ హక్కుల కోసం పోరాడే గొంతుకలను ఇటీవల తీసుకొచ్చిన కొన్ని చట్టాలు నొక్కేస్తున్నాయన్న ఐక్యరాజ్య సమితి వ్యాఖ్యలను తప్పుపట్టింది భారత్​. మానవ హక్కుల సాకుతో చట్టాల ఉల్లంఘనకు పాల్పడితే సహించబోమని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • బిహార్​ బరి
    రాఘోపుర్... బిహార్​లోని శాసనసభ నియోజకవర్గం. లాలూ కుటుంబ కంచుకోటల్లో ఒకటి. మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్​ పోటీ చేస్తోంది ఆ స్థానం నుంచే. అలాంటి రాఘోపుర్​లో జయకేతనం ఎగరేయాలని లక్ష్యంగా పెట్టుకుంది భాజపా. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • పాక్ హెచ్చరిక
    కరోనా మరణాలు పెరుగుతున్నందున పాకిస్థాన్​లో కఠిన ఆంక్షలు విధించేందుకు వెనుకాడేది లేదని ఆ దేశ నేషనల్ కమాండ్, ఆపరేషన్స్ సెంటర్ హెచ్చరించింది. ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రజలు పాటించకపోతే కఠిన చర్యలు చేపట్టడం తప్ప ఇంకో మార్గం లేదని తేల్చి చెప్పింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • మళ్లీ పెరిగింది
    బంగారం, వెండి ధరలు బుధవారం భారీగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర ఒక్క రోజులో రూ.500కు పైగా ఎగిసింది. వెండి ధర కిలోకు ఏకంగా రూ.64 వేల పైకి చేరింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఆమె ఎవరు?
    ముంబయి, పంజాబ్​ మ్యాచ్​లో.. గోళ్లు కొరుకుతూ మ్యాచ్​ చూస్తున్న ఓ అమ్మాయి ఫొటో వైరల్​గా మారింది. ఇంతకీ ఆమె ఎవరు? ఏ ఫ్రాంచైజీ అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ద్రౌపది లుక్ విడుదల
    అలనాటి హీరోయిన్ సౌందర్య చివరగా నటించిన చిత్రం 'నర్తనశాల'. ఇందులోని ఆమె ఫస్ట్​లుక్​ను బుధవారం విడుదల చేశారు. ద్రౌపది పాత్రలో ఈమె కనిపించనుంది. దసరా కానుకగా ఈనెల 24నుంచి శ్రేయస్ ఈటీ యాప్​లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందీ చిత్రం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details