ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @5PM - ఏపీ ముఖ్యవార్తలు

.

ప్రధాన వార్తలు @5PM
ప్రధాన వార్తలు @5PM

By

Published : Oct 18, 2021, 5:00 PM IST

  • TDP: కమీషన్ల కోసమే మరో ఎత్తిపోతల పథకం: తెదేపా
    చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం ముఖ్య నేతలు భేటీ అయ్యారు. తెదేపా నేతల సమావేశంలో పలు నిర్ణయాలు, తీర్మానాలు చేశారు. వైకాపా ప్రభుత్వం అజ్ఞానంతో సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని తెదేపా నేతలు ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • AP High court: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రవినాథ్ తిలారీ ప్రమాణ స్వీకారం
    రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రవినాథ్ తిలారీ ప్రమాణ స్వీకారం చేశారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ రవినాథ్ తిలారి.. రాష్ట్రానికి బదిలీపై వచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కర్నూలు: వ్యక్తి హత్య కేసులో ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష
    2013లో కోవెలకుంట్ల మండలం కలుగొట్ల వద్ద నర్సింహారెడ్డి హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితులకు 5 సంవత్సరాల పాటు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Milad un-Nabi: రేపు మిలాద్‌ ఉన్‌ నబీ సెలవు
    మిలాద్‌ ఉన్‌ నబీ సెలవును ఈ నెల 19కి మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 19నే సాధారణ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేసింది. గతంలో ప్రకటించిన 20కి బదులుగా 19కి సెలవు మారుస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్థానికేతరుల్లో గుబులు- కశ్మీర్ విడిచి వెళ్తున్న కూలీలు
    కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల వరుస దాడులు అక్కడి ప్రశాంత పరిస్థితికి భంగం కలిగిస్తున్నాయి. జీవనోపాధి కోసం జమ్ము కశ్మీర్​కు వచ్చిన కూలీలు, చిరు వ్యాపారులు.. ఇటీవలి దాడులకు బెంబేలెత్తిపోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఇంటి నుంచే ఆధార్‌ వెరిఫికేషన్.. ఇలా చేయొచ్చు!
    ప్రస్తుతం ఆధార్​ అన్ని చోట్లా తప్పనిసరిగా మారింది. అలాంటి ఆధార్​ కార్డులోనూ నకిలీలు పుట్టుకోస్తున్నాయి. మోసాలు జరుగుతున్నాయి. అందుకే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్‌ కలిగిన ప్రతి వ్యక్తి తమ ఆధార్‌ను వెరిఫై చేసుకోవాలని సూచిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మార్కెట్​లోకి 'టాటా పంచ్​'.. ధర ఎంతంటే?
    టాటా మోటార్స్​ నుంచి మరో కారు మార్కెట్లోకి వచ్చింది. 'టాటా పంచ్​' పేరుతో విపణిలోకి తెచ్చిన ఈ కారు 1.2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​తో రూపొందించినదని సంస్థ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Stock Market: రంకెలేసిన బుల్​- సెన్సెక్స్​ 460 పాయింట్లు వృద్ధి
    దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారమూ బుల్​ జోరు కొనసాగటం వల్ల జీవితకాల గరిష్ఠాలను తాకాయి. చివరకు సెన్సెక్స్​ 460 పాయింట్లు పెరిగి 61,765 వద్దకు చేరింది. నిఫ్టీ 138 పాయింట్ల వృద్ధి చెందింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • T20 India Vs Pakistan: షోయబ్‌ అక్తర్‌కు చురకంటించిన భజ్జీ
    పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌కు టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ మరోసారి చురక అంటించాడు. అక్తర్‌ చేసిన ఓ సరదా ట్వీట్‌కు భజ్జీ తనదైనశైలిలో సమాధానమిచ్చాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Maa elections 2021: 'విష్ణును రెండేళ్ల వరకు నిద్రపోనివ్వను'
    'మా' ఎన్నికల్లోఓటమి చెందిన ప్రకాశ్‌రాజ్‌.. అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణును రెండేళ్ల వరకు నిద్రపోనివ్వకుండా చేస్తానని అన్నారు. అసోసియేషన్‌లో అభివృద్ధి కోసం విష్ణు ప్యానల్​ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో తెలుసుకోవడానికి ప్రతిసారీ వారిని రిపోర్ట్‌ కార్డ్‌ అడుగుతానని మరోసారి స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details