ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రెండున్నరేళ్ల తర్వాత కుటుంబ సభ్యుల చెంతకు.. - తల్లి చెంతకు చేరిన కుమారుడు

సొంత ఊరి నుంచి కుమారుడు ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. బిడ్డ కోసం అతని తల్లి, బంధువులు వెతుకుతూనే ఉన్నారు. పోలీసుల్ని సంప్రదించారు. ఇక దొరకడని ఆశలు వదులుకున్నారు. అయినా కుమారుడి కోసం ఆ తల్లి తల్లడిల్లుతూనే ఉంది. ఆమె ఆవేదనను భగవంతుడు ఆలకించాడో ఏమో... ఊరు గాని ఊరిలో కొడుకు ఆచూకీ ఉన్నట్టు సమాచారం అందింది. రెండు సంవత్సరాలు ఏడు నెలలుగా ఆమె పడుతున్న బాధకు తెరపడింది. బంధువులు కొడుకుని తల్లి చెంతకు చేర్చారు.

The missing son joined the mother
రెండున్నరేళ్ల తర్వాత కుటుంబ సభ్యుల చెంతకు

By

Published : Dec 4, 2020, 10:45 AM IST

Updated : Dec 4, 2020, 11:04 AM IST

రెండున్నరేళ్ల తర్వాత కుటుంబ సభ్యుల చెంతకు

ఓ వ్యక్తి మతిమరుపు కారణంగా జిల్లాలు దాటి వచ్చి ఎట్టకేలకు కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు. సుమారు రెండున్నరేళ్లు అతడి కోసం అన్వేషిస్తూ.. ఆశలు వదులుకున్న సమయంలో ఆచూకీ తెలియడంతో వారి సంతోషానికి అవధులులేకుండా పోయాయి. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఇస్మాన్‌ పల్లికి చెందిన పచ్చిపాల సైదులు గ్రామంలోని ఓ కర్మాగారంలో కార్మికుడుగా పని చేసేవాడు.

మతిమరుపు, అమాయకత్వం కారణంగా 2018 మేలో ఓ ఆర్టీసీ బస్సు ఎక్కి విశాఖ జిల్లా యలమంచిలికి చేరుకున్నాడు. అక్కడి నుంచి మళ్లీ రాజమహేంద్రవరం వచ్చాడు. అతడిని లాలా చెరువులోని స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకుడు చేరదీశారు. అప్పటి నుంచి సైదులు తోచిన పని చేస్తూ వృద్ధుల వద్దే ఉంటున్నాడు. ఇంటి వద్ద తల్లి యాదమ్మ, తమ్ముడు మల్లేశ్‌, బంధువులు అప్పటి నుంచి వివిధ చోట్ల గాలించారు.

రాజమహేంద్రవరంలో ఉంటున్న అతని మేనమామ వేంకటేశ్వరరావు సేవా సంస్థ వద్ద సైదుల్ని గుర్తించారు. వెంటనే తల్లి యాదమ్మకు సమాచారం అందించారు. ఇస్మాన్‌ పల్లి నుంచి కుటుంబ సభ్యులు గురువారం రాజమహేంద్రవరం వచ్చి సైదుల్ని తల్లి వద్దకు తీసుకెళ్లారు. గుబ్బల రాంబాబు అతడికి కొంత నగదు, దుస్తులు అందజేసి ఇంటికి పంపించారు.

ఇదీ చదవండి:

'మా గ్రామానికి వంతెన నిర్మించండి...సార్'

Last Updated : Dec 4, 2020, 11:04 AM IST

ABOUT THE AUTHOR

...view details