'అవంతి' కోసం త్యాగానికి సిద్ధమయ్యా: గంటా - tdp leaders
తాను ప్రజారాజ్యంలోకి వెళ్లే ముందు చంద్రబాబును ఒక్కమాట అనలేదని మంత్రి గంటా శ్రీనివాసరావు ఉద్ఘాటించారు.
అవంతి శ్రీనివాస్ కోసం భీమిలి టికెట్ వదలుకునేందుకు సిద్ధమయ్యానని మంత్రి గంటా తెలిపారు. పార్టీ మారాక అవంతి చేస్తున్న విమర్శలను ప్రజలు హర్షించరని పేర్కొన్నారు. జగన్‌ను ఉగ్రవాది కంటే ప్రమాదకారి అని... రాజకీయాల నుంచి బహిష్కరించాలన్న శ్రీనివాస్... ఆయన పంచన ఎలా చేరారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు కాపుమిత్ర అంటూ నెల రోజుల క్రితమే పాలాభిషేకం చేసింది మరిచారా అంటూ ప్రశ్నించారు. అన్ని జిల్లాల వైకాపా ఇన్‌ఛార్జ్‌లు జగన్ సామాజిక వర్గం వారే ఉన్నారని పేర్కొన్నారు.