రాజమహేంద్రవరంలో ఆర్పీఎల్ క్రికెట్ పోటీలను మంత్రి అనిల్ కుమార్ యాదవ్, హీరోయిన్ పాయల్ రాజ్పుట్ ప్రారంభించారు. ఏడు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. 24 జట్లు 72 మ్యాచ్లు ఆడనున్నాయి. ఐపీఎల్ తరహాలో నిర్వహించే ఈ క్రికెట్ పోటీలు ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ మర్గాని భరత్, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం క్రీడల్ని ప్రోత్సహిస్తుందని...ఈ తరహా పోటీల్లో యువత పాల్గొని సత్తా చాటాలని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. రేపు సీఎం జగన్ పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు వస్తున్నారని తెలిపారు. ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని మంత్రి మరోసారి స్పష్టం చేశారు.