గ్రామ వాలంటీర్ల వ్యవస్థ హర్షణీయమని పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ ఛైర్మన్ బుచ్చిరాజు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో ఆ సంఘం జోనల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బుచ్చిరాజు మాట్లాడారు. గ్రామీణ యువతకు సేవ చేసే అవకాశం కల్పించడం హర్షణీయమన్నారు. పంచాయతీ కార్యదర్శుల 4 అంచెల వ్యవస్థను... 2 అంచెల వ్యవస్థగా కుదింపు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 1993 నాటి పంచాయతీల్లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించి అర్హులను పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని తీర్మానం చేశారు.
"గ్రామ వాలంటీర్ల వ్యవస్థ హర్షణీయం" - Rajamahendravaram
గ్రామ వాలంటీర్ల వ్యవస్థను పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ సమర్ధిస్తోందని ఆ సంఘం ఛైర్మన్ బుచ్చిరాజు తెలిపారు.
గ్రామ వాలంటీర్ల వ్యవస్థ హర్షనీయం: బుచ్చిరాజు