ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అభివృద్ధికి ఆటంకం కలిగించడమే తెదేపా పని' - kannababu comments on tdp

రాష్ట్రాభివృద్ధికి తెదేపా అడుగడుగునా అడ్డుపడుతోందిని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా... దాన్ని ఆపడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో... కాకినాడ ఎంపీ వంగా గీతతో కలిసి మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు.

Minister Kannababu controversial comments on Babu
మాట్లాడుతున్న మంత్రి కురసాల కన్నబాబు

By

Published : Jan 29, 2020, 5:44 PM IST

మాట్లాడుతున్న మంత్రి కురసాల కన్నబాబు

కాపు సామాజిక వర్గానికి చెందిన పేదింటి మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించి... వారి ఉన్నతి తోడ్పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. 45 నుంచి 60 ఏళ్ల వయసున్న వారికి ప్రతీఏటా రూ.15 వేలు ఇవ్వనున్నట్టు వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు వచ్చే ఏడాది నుంచి... సంవత్సరానికి రూ.19 వేలు ఇస్తామన్నారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు వివరించారు.

ఉగాదికి ఇచ్చే ఇళ్ల పట్టాలను కూడా... మహిళల పేరిటే రిజిస్టర్ చేసి ఇవ్వనున్నట్టు చెప్పారు. రేషన్ కార్డును ఇకనుంచి రైస్​ కార్డుగా ఇస్తామన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు తాగునీరు అందించడానికి వాటర్​గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు తెలిపారు. ఇందు కోసం రూ.8వేల 500 కోట్లు మంజూరు అయినట్లు మంత్రి కన్నబాబు వివరించారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా... పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులను ఆధునికీకరిస్తున్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details