భార్యపై అనుమానంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. కత్తితో నరికి చంపేశాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం పిడింగొయ్యిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. సంవత్సరం క్రితం దంపతుల మధ్య తగాదాలు జరిగాయని.. కొత్త పేట పోలీస్ స్టేషన్ లో పెద్దల సమక్షంలో సర్ది చెప్పి కాపురానికి పంపించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకుని చట్ట ప్రకారం శిక్షిస్తామని .. బొమ్మూరు ఇన్చార్జ్ సీఐ సురేష్ బాబు చెప్పారు.
దారుణం... అనుమానంతో భార్యను చంపేశాడు! - రాజమహేంద్రవరం
భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది. అనుమానమే ఈ ఘటనకు దారితీసింది.
సీఐ సురేష్ బాబు