వైకాపా ఏడాది పాలనపై తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలు చిరునామా లేకుండా పోయాయని ఆరోపించారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపిన వారిని వేధిస్తున్నారని... తప్పుడు కేసులతో కోర్టుల చుట్టూ తిప్పిస్తున్నారని మండిపడ్డారు. ఏడాది జగన్ పాలలో సాధించిన ప్రగతి ఏ మాత్రం లేదని..90వేల కోట్లు అప్పు మాత్రం మిగిలిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మైనింగ్, ఇసుకు, మద్యం, సారా మాఫియాలు పెరిగిపోయాయని అన్నారు.
ప్రగతి లేదు..90వేల కోట్ల అప్పు మాత్రం ఉంది: బుచ్చయ్య చౌదరి - gorantla buchaiah chowdary news
వైకాపా ఏడాది పాలనలో సాధించిన ప్రగతి ఏ మాత్రం లేదని తెదేపా నేత బుచ్చయ్య చౌదరి విమర్శించారు. వైకాపా నేతల దోపిడీకి అదుపు లేకుండా పోయిందన్నారు.
gorantla buchaiah chowdary
Last Updated : May 25, 2020, 2:50 PM IST