ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సొంత గూటికి చేరిన మాజీ ఎంపీ హర్షకుమార్ - ఏపీ కాంగ్రెస్ న్యూస్

మాజీ ఎంపీ హర్షకుమార్ తిరిగి కాంగ్రెస్​ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్​ఛార్జి ఉమెన్ చాందీ..హర్షకుమార్​కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Ex mp harsha kumar
Ex mp harsha kumar

By

Published : Nov 23, 2020, 8:25 PM IST

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ హర్షకుమార్

మాజీ ఎంపీ హర్షకుమార్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చెరుకూరి కన్వెన్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్​ఛార్జి ఉమెన్​ చాందీ, ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సమక్షంలో హర్షకుమార్ కాంగ్రెస్​లో చేరారు. ఉమెన్​ చాందీ హర్షకుమార్​కు కాంగ్రెస్​ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు కాంగ్రెస్​ శ్రేణులు నగరంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details