రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్ బదిలీ దుర్మార్గమని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. సెలవులో ఉన్న రాజారావును బదిలీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీల పట్ల ముఖ్యమంత్రి జగన్ వివక్ష చూపుతున్నారని.. జగన్ బినామీ పేర్లతో విశాఖలో భూములు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. నిజాయతీగా పనిచేసిన రాజారావును ఎందుకు బదిలీ చేశారని నిలదీశారు. జైలులో దేవినేని హత్యకు కుట్ర చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతోందన్నారు. బదిలీ, దేవినేని హత్యకు కుట్రపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని హర్షకుమార్ కోరారు.
Devineni arrest: జైలులో దేవినేని హత్యకు కుట్ర చేస్తున్నారా...? - devineni uma arrest latest new
జైలులో దేవినేని హత్యకు కుట్ర చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌ను ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు.
congress harshakumar comments on devineni uma arrest