జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్‌పై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుంచరులు దాడి చేసింది వాస్తవమే అని ప్రత్యక్ష సాక్షి ప్రొఫెసర్ వసుంధర తెలిపారు. కస్తూరీదేవి విద్యాలయాల సమస్యపై మాట్లాడేందుకు తాను డోలేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లాలని, ఆ సమయంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి అక్కడికి వచ్చారని ఆమె చెప్పారు. తనకు ఫోన్ కాల్ వచ్చి బయటకు వెళ్లిన సమయంలో ఇరువురి ఘర్షణ జరిగినట్లు చెప్పారు. వారిద్దరి మధ్య ఏం గొడవలు ఉన్నాయో తెలియదన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా జమీన్ రైతు పత్రికలో అవాస్తవ కథనాలు రాస్తున్నారని, దీనిపై తాము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
డోలేంద్రపై దాడి వాస్తవమే... కానీ...! - nellore
జమీన్ రైతు పత్రిక సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ వ్యవహారంపై.. ప్రొఫెసర్ వసుంధర మీడియా సమావేశంలో స్పందించారు. తనపై తప్పుడు రాతలు రాశారని.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని చెప్పారు.
డోలేంద్రపై దాడి జరిగింది వాస్తవం... మహిళపై రాతలను సహించేది లేదు