నిన్నటికి నిన్న అనంతపురంలో ఓ వృద్ధురాలి వద్ద దొంగ నటనతో ఓ కేటుగాడు బంగారం దోచుకెళ్లాడు. అలాంటి ఘటనే ఇప్పుడు నెల్లూరులో జరిగింది. కానీ ఈ దొంగ ప్రభుత్వ ఉద్యోగి అవతారం ఎత్తాడు. పింఛను ఇప్పిస్తానంటూ..చెప్పేసరికి నమ్మింది వృద్ధురాలు. తీరా బంగారం దోచుకుని వెళ్లాక... చేసేదేమీ లేక లబోదిబోమంది.
బంగారం ఉంటే పింఛను రాదమ్మా!
నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం మదరాబాదులో ఓ వ్యక్తి పింఛను నమోదు చేసే అధికారిని అంటూ తిరిగాడు. కాసేపయ్యాక అన్నపూర్ణ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లాడు. మీ భర్తకు వయసు అయిపోయింది.. నీ పేరుపై పెన్షన్ నమోదు చేస్తానని చెప్పాడు. ఫారం నింపాలి...ఫొటో కూడా దిగాలంటూ నమ్మించాడు కేటుగాడు. ఎలాగైతేనేం పింఛను వస్తుంది కదా అనుకుంది అన్నపూర్ణ. ఫొటో దిగేందుకు సిద్ధమైన వృద్ధురాలితో మెడలో బంగారం ఉంటే..పెన్షన్ రాదమ్మా అని చెప్పగానే నమ్మేసింది వృద్ధురాలు.