ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలీసులను పరుగులు పెట్టించిన లఘు చిత్ర షూటింగ్

నెల్లూరు నగరంలో కొందరు కత్తులతో భీకర వాతావరణం సృష్టిస్తున్నారని.. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి పరుగులు తీసిన పోలీసులు.. అది లఘు చిత్ర షూటింగ్ అని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు.

By

Published : Nov 21, 2020, 10:47 PM IST

short film issue
నటులను ప్రశ్నిస్తున్న పోలీసులు

నెల్లూరులో ఓ లఘ చిత్ర షూటింగ్ పోలీసులను పరుగులు పెట్టించింది. నగరంలో కత్తులతో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. స్థానికులు నిజమైన ఘర్షణ అనుకుని పోలీసులకు సమాచారమిచ్చారు.

పోలీసులు అక్కడికి చేరుకోవడంతో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. చివరకు చిత్రీకరణ అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా షూటింగ్ చేయవద్దంటూ.. పోలీసులు వారిని మందలించి వదిలేశారు.

నటులను ప్రశ్నిస్తున్న పోలీసులు

ఇదీ చదవండి:సమస్యలకు నిలయాలుగా గ్రంథాలయాలు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details