లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబు చెప్పారు. కేసులు పెట్టి, అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఐసోలేషన్ వార్డులతో నెల్లూరు సర్వజన వైద్యశాలను కొవిడ్-19గా పేరు మార్చామని తెలిపారు. ఆసుపత్రిలో నూతన బ్లాక్స్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. కేసుల సంఖ్య పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. జిల్లాలో 15 వేల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు ఆరు వేల మంది ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్లు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారని స్పష్టం చేశారు. కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా ఏడు వందల స్ప్రేయర్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు.
'లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు'
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని చర్యలు చేపట్టామని నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు. నెల్లూరు సర్వజన వైద్యశాలను కొవిడ్-19 కేసుల కోసం సిద్ధం చేశామన్నారు. కరోనా ప్రభావంపై గ్రామ, వార్డు వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్లతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో అమలు చేస్తున్న కరోనా నివారణ చర్యలపై కలెక్టర్ ఈటీవీ భారత్‌తో మాట్లాడారు.
నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు