ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యుత్ శాఖలో అవినీతి అధికారి.. ఆదాయానికి మించి ఆస్తులు గుర్తింపు - ACB Raids In Nellore district news

విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ విజయ్‌కుమార్‌రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. విజయ్‌కుమార్‌రెడ్డికి సంబంధించి పలుచోట్ల భారీగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించామని అనిశా డీఎస్పీ చెప్పారు.

ACB Raids On Electricity SE In Nellore
విద్యుత్ శాఖలో అవినీతి తిమింగలం.. ఆదాయానికి మించి ఆస్తులు గుర్తింపు

By

Published : Dec 2, 2020, 7:00 PM IST

అ.ని.శా. డీఎస్పీ శాంత్రో

నెల్లూరు జిల్లాలో విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ విజయ్‌కుమార్‌రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణపై నెల్లూరు జిల్లాలో 7 చోట్ల సోదాలు చేశారు. నెల్లూరు చిల్డ్రన్‌ పార్క్‌ వద్ద విలాసవంతమైన భవనం గుర్తించినట్టు అ.ని.శా. డీఎస్పీ శాంత్రో తెలిపారు. నెల్లూరు రామ్మూర్తినగర్‌లో బహుళ అంతస్తుల భవనం, నెల్లూరులో 5 ఇళ్ల స్థలాలు, ముత్తుకూరులో 14 ఎకరాల వ్యవసాయ భూమి, కోటలోని కంపెనీలో రూ.50 లక్షల పెట్టుబడి ఉన్నట్లు గుర్తించినట్టు అ.ని.శా. డీఎస్పీ వివరించారు. విజయ్‌కుమార్‌రెడ్డి బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందని చెప్పారు. విజయకుమార్ రెడ్డి 1989లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)గా ఉద్యోగంలో చేరారు. ప్రకాశం జిల్లాలో మొదట పనిచేశారు. అక్కడి నుంచి డివిజనల్ ఇంజినీర్, సూపరింటెండెంట్ ఇంజినీర్ స్థాయికి ఎదిగారు. భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అనిశా సోదాల్లో వెలుగు చూశాయి. అనిశా అధికారులకు వచ్చిన ఫిర్యాదు మేరకు తెల్లవారు జాము నుంచి పక్కా ప్రణాళికతో సోదాలు సాగిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details