కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామపంచాయతీ ఎదుట స్మశానవాటికలో ఉన్న డంపింగ్ యార్డు తొలగించాలంటూ కోడుమూరు అభివృద్ధి కమిటీ,వామపక్షాల ఆధ్వర్యంలో కులసంఘాలు ధర్నా చేశారు.ఊర్లోని చెత్త అక్కడే వేస్తుండడంతో అంత్యక్రియలు చేసేందుకు ఇబ్బందిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే డంపింగ్ యార్డును తొలగించి చెత్తను తరలించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ వేరే ప్రదేశానికి త్వరలో మారుస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
స్మశానవాటికలోని డంపింగ్ యార్డు తొలగించాలని ధర్నా - డంపింగ్ యార్డు
కోడుమూరు గ్రామపంచాయతీ ఎదుట స్మశానవాటిక సమీపంలోని డంపింగ్ యార్డు తొలగించాలంటూ , వామపక్షాల ఆధ్వర్యంలో కులసంఘాలు ధర్నా చేశాయి.
villagrs protests at kodumuru in kurnool