విహారయాత్రలో విషాదం.. ప్రమాదవశాత్తు వైద్యుడు మృతి - kulumanali
కులుమనాలిలో విహారయాత్రకు వెళ్లి హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు మృతి చెందాడు. ప్యారాచూట్ ద్వారా గాలిలో ఎగిరి ప్రమాదవశాత్తు కిందపడి మరణించారు.
విహారయాత్రలో విషాదం.. ప్రమాదవశాత్తు వైద్యుడు మృతి
తెలంగాణలోని హైదరాబాద్ నాగోల్‌కు చెందిన వైద్యుడు చంద్రశేఖర్‌రెడ్డి విహారయాత్రలో భాగంగా కులుమనాలి వెళ్లారు. అక్కడ ప్యారాచూట్ ద్వారా గాలిలో ఎగిరిన సమయంలో ప్రమాదవశాత్తు కింద పడ్డారు. తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్‌రెడ్డిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. చంద్రశేఖర్‌రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా.