Search for diamonds in Nallamala Forest : వాగులో వజ్రాలు దొరుకుతాయని వారు జల్లెడ పడుతున్నారు. అడవుల్లో కురిసిన వర్షాలతో రత్నాలు కొట్టుకొస్తాయని నమ్ముతున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే రహదారి సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని వక్కిలేరు వాగులో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పరుగులు తీస్తున్నారు.
Search for diamonds in Nallamala Forest : వక్కిలేరు వాగులో...వజ్రాలకోసం వెతుకులాట... - వక్కిలేరు వాగులో వజ్రాల కోసం వెతుకులాట
Search for diamonds in Nallamala Forest : వజ్రాలు దొరుకుతాయని వారు వాగులో జల్లెడ పడుతున్నారు. అడవుల్లో కురిసిన వర్షాలతో రత్నాలు కొట్టుకొస్తాయని నమ్ముతున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే రహదారి సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని వక్కిలేరు వాగులో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పరుగులు తీస్తున్నారు.
శ్రీ సర్వ నరసింహస్వామి ఆలయ సమీపాన ఉన్న వక్కిలేరు వాగులో చాలా రోజుల నుంచి వజ్రాల కోసం వెతుకులాట కొనసాగుతోంది. వేరు వేరు జిల్లాల నుంచి సైతం వచ్చి వాగులో వజ్రాల కోసం వెతుకుతున్నారు. వాగులోని నీటిలో, రాళ్ల మాటున వజ్రాలు ఉంటాయన్న ఆశతో వెతుకుతున్నారు. వర్షాల వల్ల అడవి నుంచి వజ్రాలు కొట్టుకొస్తాయని వీరు నమ్ముతున్నారు. కొంత మందికి వజ్రాలు దొరికాయని, తమకి కూడా దొరుకుతాయనే ఆశతో వజ్రాల కోసం వెతుకుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఇదీ చదవండి : Achennaiadu On State Govt: బలవంతం లేదంటూనే.. బెదిరిస్తున్నారు: అచ్చెన్నాయుడు