కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కర్నూలు నగరం సహా పాణ్యం, బేతంచర్ల, గోనెగండ్ల, కోవెలకుంట్ల, సీ బెళగల్, కొత్తపల్లి, మద్దికెర, పాములపాడు, నంద్యాల, ఓర్వకల్లు, డోన్, పగిడ్యాల, వెల్దుర్తి, దేవనకొండ, నందికొట్కూరు, హొళగుంద, పత్తికొండ, కృష్ణగిరి, ఎమ్మిగనూరు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. కర్నూలు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోకి వర్షపునీరు చేరింది. పెద్దపాడు సమీపంలోని కూరగాయల మార్కెట్ చిత్తడిగా మారింది. రహదారులు జలమయమయ్యాయి.
కర్నూలులో వర్షం.. రహదారులు జలమయం - todays kurnool rain news
కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచింది.
కర్నూలులో వర్షం.. రహదారులు జలమయం